16న ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
ఈ నె 16న ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరగనుంది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ జైబాల్ను రాజ్భవన్లో అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. ఆప్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ను కేజ్రీవాల్ కోరారు. 15 నిమిషాలు పాటు రాజ్భవన్లో కేజ్రీవాల్ ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణస్వీకారంపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.













