సామాన్యుడి కోసం ప్రశాంత్ కిశోర్ బృందం
సామాన్యుడిగా వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగిన అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. మరికొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన రాజకీయ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ (ఇండియా ప్యాక్)తో కేజ్రీ చేతులు కలిపారు. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇండియన్ ప్యాక్ మాతో కలిసి పనిచేసేందుకు రావడం ఆనందంగా ఉంది. వారికి స్వాగతం పలుకుతున్నాం అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని ఐ-ప్యాక్ కూడా ధ్రువీకరించింది.













