ఆ రెండు అంశాలపై ప్రధానితో చర్చించా : కేజ్రీవాల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ భేటీ అయ్యారు. ఆయన పార్లమెంట్ భవన్లో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరు పలు కీలక అంశాలపై చర్చించారు. ఢిల్లీ అల్లర్లపై చర్చించారు. ప్రధానంగా ఢిల్లీ అల్లరు, కోవిడ్-19 (కరోనా) వైరస్ నిరోధానికి సమష్టిగా కలిసి పనిచేయడం చర్చించారు. సమావేశానంతరం మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీ అల్లరు, కరోనా వైరస్‌పై ఇరువురం చర్చించామని తెలిపారు. ఢిల్లీ అల్లర్లకు ఎవరు కారణమైనా, ఏ పార్టీకి చెందినవారైనా వారిని కఠినంగా శిక్షించాలని ప్రధానికి తాను చెప్పానని అన్నారు. దేశ రాజధానిలో ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని కోరానని చెప్పారు. అల్లర్ల నియంత్రణ ఢిల్లీ పోలీసులు పనితీరు బాగుందని కితాబిచ్చారు.
కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కలసికట్టుగా పని చేయడంపై కూడా ఇరువురం చర్చించామని తెలిపారు. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోందని, ఇప్పటికే ఢిల్లీ, తెలంగాణలో రెండు కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విస్తరిస్తోందని తెలిపారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టిన అనంతరం ప్రధానిని కలుసుకోవడం ఇదే ప్రథమం. ఢిల్లీ అల్లర్ల అనంతరం కూడా వీరిద్దరు సమావేశం కావడం ఇదే మొదటిసారి.













