వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆరోగ్య బీమా
ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య బీమా అమలుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. ఈ పథకం రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రులు, ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఇది నగదు రహిత పథకమని ఆయన పేర్కొన్నారు. ట్రస్టు నమూనాలో నడపాలా? బీమా నమూనాలో నిర్వహించాలా అనేది పరిశీలిస్తున్నామని, పథకం తీరు తెన్నులపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశాక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొస్తామని జైట్లీ వెల్లడించారు.
పేదల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 10కోట్ల కుటుంబాలకు దీని వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఆయుష్మాన్ భారత్ కింద రెండు పథకాలను ప్రకటించారు. జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం కింద చికిత్స పొందడానికి చేరిన కుటుంబానికి రూ.5లక్షల వరకూ కవరేజీ లభిస్తుంది. 50కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య పథకాల్లో ఇదే అతిపెద్దది. ప్రస్తుతం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద పేద కుటుంబాలకు వార్షిక కవరేజీ రూ.30వేల మేర మాత్రమే లభిస్తోంది….













