స్పెషల్ డిస్కౌంట్ సేల్ ప్రకటించిన జెట్ ఎయిర్ వేస్
ప్రైవేట్ ఎయిర్‌లైన్ జెట్ ఎయిర్వేస్ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ (అన్నీ పన్నులు కలుపుకొని) వన్ వే, ఎకనమీ క్లాస్ టిక్కెట్లపై ప్రకటించింది. ప్రారంభం ధర రూ.1,111గా నిర్ణయించింది. ఎంపిక చేసిన సెక్టార్లలో పరిమితి కాలం ఆఫర్ ఇది అని తెలిపింది. మాన్సూన్ సేల్ పేరుతో మూడు రోజుల పాటు టిక్కెట్లు విక్రయం నేటి నుంచి ప్రారంభమవుతుంది. అయితే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని జూన్ 27 నుంచి సెప్టెంబర్ 20 మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలని జెట్ ఎయిర్వేస్ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రత్యేక ధరల టిక్కెట్లు ఎవరు ముందు వస్తే వారికి ముందు అన్న ప్రాతిపదికన ఉంటుంది. డైరెక్ట్ ఫ్లయిట్స్ వన్‌వేతో పాటు తిరుగు ప్రయాణానికి ఇది వర్తిస్తుందని ప్రకటనలో వివరించింది.













