ఎయిరిండియా సంచలన నిర్ణయం
సాయుధ దళాలకు ఎయిరిండియా తీపి కబురు చెప్పింది. వారికి ఇటువంటి అవకాశాన్ని కల్పించడం ఇదే తొలిసారి. సైన్యం, వాయుసేన, నావికా దళాల సిబ్బంది తమ విమానాల్లో ప్రయాణించేందుకు వచ్చినప్పుడు వారికే మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఎయిరిండియా ప్రకటించింది. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ప్రయాణికుల కన్నా ముందుగా విమానం ఎక్కే అవకాశం ఈ సాయుధ దళాల సిబ్బందికే ఇస్తామని తెలిపింది. ఈ దళాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న, గతంలో పని చేసిన, భవిష్యత్తులో పని చేయబోయేవారిని గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. భారతదేశ 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నిబంధలను అమల్లోకి వచ్చాయని ఎయిరిండియా సీఎండీ అశ్వనీ లోహానీ తెలిపారు. ఫ్లస్ క్లాస్, బిజినెస్ క్లాస్ ప్రయాణికుల కన్నా ముందుగానే వచ్చి విమానం ఎక్కాలని ఈ దళాల సిబ్బందిని కోరుతామన్నారు. దేశీయ ప్రయాణాల్లో సాయుధ దశాలకు విమాన ఛార్జీల్లో డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.













