ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.500 కోట్ల విరాళం
పీఎం-కేర్స్ ఫండ్‌కు భారత పారిశ్రామిక రంగం భారీ ఎత్తున విరాళాలు అందజేస్తున్నాయి. కోవిడ్-19 కట్టడి కోసం ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.500 కోట్లు విరాళాన్ని ప్రకటించింది. కాగా కోవిడ్-19పై పోరాటానికి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి గంగవరం పోర్టు రూ.3 కోట్ల విరాళం ఇచ్చింది. ఈ మేరకు చెక్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి గంగవరం పోర్టు చైర్మన్ డీవీఎస్ రాజు, సీఈఓ ఎన్ సాంబశివరావు పోర్టు చైర్మన్ డీవీఎస్ రాజు, సీఈఓ ఎస్ సాంబశివరావు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ కంపెనీ ఇండియన్ ఇమ్యునాలిజి కల్ లిమిటెడ్ (ఐఐఎల్) రూ.2.33 కోట్ల సాయం అందించగా యూపీఎల్ రూ.75 కోట్ల విరాళం ఇచ్చింది.













