ఢిల్లీ బీజేపీ ప్రచారంలో.. నటి మాధవి లత
నచ్చావులే హీరోయిన్, నటి మాధవి లత క్రిందటి సంవత్సరం భారతీయ జనతా పార్టీ లో సభ్యత్వం తో క్రియాశీల రాజకీయాల్లో చేరిన సంగతి తెలుసిందే. 2019 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మాధవి లత పశ్చిమ గుంటూరు నియోజన వర్గం నుంచి బీజేపీ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే!
ప్రస్తుతం దేశం అంతా ఎంతో ఆత్రుత తో ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ కేజ్రీవాల్ నాయకుడిగా ఆమ్ పార్టీ కి బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లో బీజేపీ తరుపున ప్రచార కార్యక్రమాలలో పాల్గొనమని తెలుగు అమ్మాయి మాధవి లత ను ఆహ్వానించారు.
5 ఫిబ్రవరి 2020 నుంచి 3-4 రోజులు ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నానని మాధవి లత తెలిపారు. 5 ఫిబ్రవరి న ఢిల్లీ లోని మాల్వియా నగర్ సెగ్మెంట్ లో స్థానిక నాయకులతో కలిసి ప్రచారం చేశారు. ఆ ఏరియా లో మహిళలు ఎక్కువ గా ఉండటం వలన, హౌస్ మీటింగ్స్ లలో నటి మాధవి లత మహిళలను కలిసి మాట్లాడారు.
చాలా మంది యువతి యువకులు సినిమా నటి అని తెలియగానే ఉత్సాహంగా ముందుకు వచ్చి అభినందనలు తెలిపి, ఫోటోలు తీయుంచుకొన్నారని, వారు అందరూ బీజేపీ అభిమానులే అని మాధవి లత తెలిపారు. ఈవిధం గా డిల్లి ఎన్నికల ప్రచారం లో పాల్గొనటం చాలా సంతోషం గా ఉందని మాధవి లత అన్నారు.













