లోకనాయకుడు : మోడీకే జై అంటోన్న దేశం
పెద్ద నోట్ల రద్దు, జన్ ధన్ యోజన, జీఎస్టీ.. ఇలా రకరకాల పథకాలతో దేశాన్ని సంస్కరణ పథంలో తీసుకువెళుతున్న మోడీ సర్కార్ అరుదైన గౌరవాన్ని పొందింది. ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన గవర్నమెంట్ గా నిలిచింది. దేశంలోని 73% మంది ప్రజలు ఎన్డీయే ప్రభుత్వం పట్ల నమ్మకముందని చెబుతున్నారు. ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ అనే సంస్థ జరిపిన సర్వేలో ఇది తేలింది. ఈ సంస్థ ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తోంది. ఆర్థిక, సామాజిక, పర్యావరణ మార్పులపై ఆయా దేశాలకు ఎప్పటికప్పుడు సమాచారమందిస్తుంటోంది. మరోవైపు కెనడా, టర్కీ ప్రభుత్వాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో 62శాతం ప్రజల నమ్మకాన్ని పొందగా, 58శాతంతో టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్స్ థర్డ్ ప్లేస్ పొందారు.













