బిజెపి గూటికి వీవీఎస్ లక్ష్మణ్, సినీ హీరోలు…?
దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ కొన్ని రాష్ట్రాల మీద కాస్త ఎక్కువగా దృష్టి పెట్టింది. అందులో ప్రధానంగా తెలంగాణ తమిళనాడు, కేరళ రాష్ట్రంలో ఖచ్చితంగా బలోపేతం ఏ విధంగా అడుగులు వేస్తున్నది. అయితే కేరళ రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పుడు తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ పెద్దలు కాస్త గట్టిగానే దృష్టి పెట్టారు అని రాజకీయ వర్గాలు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీకి పెద్దగా అవకాశాలు ఎక్కడా రాలేదు.
ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సరే రఘునందన్ రావు ఖాతాలోకే ఆ విజయం వెళ్తుంది. కానీ భారతీయ జనతా పార్టీలోకి మాత్రం కాదు. అందుకే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలంగాణ మీద కాస్త గట్టిగానే దృష్టి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఎలా అయినాసరే భారతీయ జనతా పార్టీ గెలవాలని చూస్తుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలం పెంచుకోవడానికి సినీ నటులను ఎక్కువగా నమ్ముకునే అవకాశాలు కనబడుతున్నాయి.
చిరంజీవి, నాగార్జున అలాగే కొంతమంది సినీ నటులను భారతీయ జనతా పార్టీలోకి తీసుకెళ్లే విధంగా ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు గా రాజకీయ వర్గాలు అంటున్నాయి. గత ఏడాది కాలంగా మెగాస్టార్ చిరంజీవి పదేపదే ప్రధానమంత్రి నరేంద్రమోడీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ప్రధానమంత్రి మోడీ భజన చేస్తుంది అనే వ్యాఖ్యలు కూడా కొంతమంది చేశారు. ఇక నాగార్జున విషయానికి వస్తే రాజకీయాల మీద పెద్దగా దృష్టి పెట్టని ఆయన మీద కూడా దృష్టి పెట్టింది.
అలాగే ఒకరిద్దరు నిర్మాతలు మీద కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలి అంటే ప్రజల్లో ఇమేజ్ ఉన్న వారి ద్వారా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే తెలంగాణలో ఇమేజ్ వున్న కొంత మందిని ఎంపిక చేసుకొని ఆ విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇప్పటికే బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన సైనా నెహ్వాల్ ద్వారా కొంతమంది మాజీ క్రీడాకారులను కూడా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు బీజేపీ నేతలు చేస్తున్నారు. మరి ఈ రాజకీయం బిజెపికి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా బిజెపిలోకి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ని గద్దె దించడానికి అన్ని శక్తులను కూడగట్టుకుని ముందుకు వెళుతుంది భారతీయ జనతా పార్టీ.













