ఇరాన్ దిగొచ్చేదాకా హర్మూజ్ దిగ్భందనమే.. ట్రంప్ కీలక నిర్ణయం..!
ఇరాన్ ను ఆయుధాలతో భయపెట్టాలని చూసి విఫలమైన అమెరికా.. ఇప్పుడు ఆర్థిక దిగ్భందనంతో ఒత్తిడి తెస్తోంది. ఇరాన్ నౌకలను కదలనివ్వకుండా చేయడం ద్వారా.. ఆదేశ ఆర్థికరంగాన్ని టార్గెట్ గా చేసుకుంది ట్రంప్ సర్కార్. ఒక్క నౌక కూడా కదలకపోవడంతో.. ఇరాన్ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఈపరిస్థితుల్లో ఇరాన్ పై ఒత్తిడిని మరింత పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్షుడు ట్రంప్.ఇరాన్‌పై దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవ్వాలని ట్రంప్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం.
సైనిక దాడులను తిరిగి ప్రారంభించడంతో పోలిస్తే .. ఈ దిగ్బంధనంతోనే ఇరాన్ (Iran)కు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో కొనసాగుతోన్న దిగ్బంధనాన్ని మరికొన్ని రోజులు పొడిగించాలని నిర్ణయించుకున్నారు. ఈ దిగ్బంధనం వల్ల ఇరాన్ చమురు ఎగుమతులు తగ్గిపోయాయి. ఇది దాని ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా వ్యూహం అమలైతే.. ఇరాన్ సుదీర్ఘకాలం ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదు. మరోవైపు.. అమెరికా దిగ్బంధనం చర్యలకు ప్రతిగా ఇరాన్ ఎలాంటి చర్యలకు దిగుతుందోనని ఆందోళనలు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) అమెరికాకు గట్టి హెచ్చరికలు చేసింది. యూఎస్ తిరిగి సైనిక చర్యలకు దిగితే.. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని పేర్కొంది. ఐఆర్జీసీ నావికాదళానికి చెందిన ఒక సీనియర్ అధికారి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. అమెరికా మళ్లీ దురాక్రమణకు పాల్పడితే.. పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న ఇరాన్‌కు అనుకూలమైన గ్రూపులు రంగంలోకి దిగుతాయన్నారు. అమెరికాకు చెందిన భారీ నౌకలను సముద్రంలోనే తగలబెట్టేస్తామని వ్యాఖ్యానించారు.
అమెరికాతో సీజ్ఫైర్ జరిగినా.. ఇప్పటికీ యుద్ధం కొనసాగుతున్నట్లే భావిస్తున్నామని ఇరాన్ ఆర్మీ ప్రతినిధి అమిర్ అక్రమినియా పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి పూర్తిగా తమ సాయుధ దళాల నియంత్రణలోనే ఉందని వ్యాఖ్యానించారు. భూతలదాడులకు దిగుతామని శత్రువులు పదే పదే బెదిరించి.. చివరికి వెనక్కి తగ్గారన్నారు.
ఇవి కూడా చదవండి








