Mexican America: ట్రంప్ కు ఇచ్చిపడేసిన మెక్సికో ప్రెసిడెంట్..
అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్(trump) కు ఘాటుగా బదులిచ్చారు మెక్సికన్ ప్రెసిడెంట్.. మీరు గల్ఫ్ ఆఫ్ అమెరికా అని అంటుంటే .. మేం మెక్సికన్ అమెరికా(mixican america) అని పిలిస్తే బాగుంటుంది కదా అంటూ అంటూ సెటైర్ వేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన క్లాడియా (Mexico President Claudia Sheinbaum).. 17వ శతాబ్దం నాటి ప్రపంచపటాన్ని చూపించారు. అప్పట్లో ఉత్తర అమెరికాను ‘మెక్సికన్ అమెరికా (Mexican America)’ అని పేర్కొనేవారనే విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఐక్యరాజ్య సమితి గుర్తించిందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు.
అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలను రెండోసారి చేపట్టేందుకు సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్.. ప్రమాణస్వీకారానికి ముందే పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కెనడా, గ్రీన్లాండ్, పనామా కాలువలను విలీనం చేసుకుంటామన్న ట్రంప్ (Donald Trump).. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మారుస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మెక్సికో (Mexico) అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ స్పందించారు. ఆయన (ట్రంప్) పేరు గురించి మాట్లాడారు. మేమూ దాని గురించే చెబుతున్నాం’’ అని మెక్సికో అధ్యక్షురాలు వ్యాఖ్యానించారు. అమెరికాకు కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
జనవరి 20న ట్రంప్ (Dobald Trump) నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.అయితే, గత కొద్ది రోజులుగా ఆయన తనలోని విస్తరణ కాంక్షను బయటపెడుతున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని అనుకుంటున్నా. అదే సరైంది కూడా..! లక్షలాది మంది మా దేశంలోకి అక్రమంగా ప్రవేశించకుండా మెక్సికో అడ్డుకోవాలి. ఆ దేశాన్ని మాదకదవ్యాల ముఠాలు నడిపిస్తున్నాయి’’ అని దుయ్యబట్టారు. అంతకుముందు కూడా ఈ అంశంపై ట్రంప్ మాట్లాడుతూ.. అక్రమ వలసదారులు, డ్రగ్స్ రవాణాను అడ్డుకోకపోతే.. మెక్సికోపై టారిఫ్‌లు కఠినంగా విధిస్తామని హెచ్చరించారు.






