Trump: విదేశీ విద్యార్థులు, ఉద్యోగులకు మెయిల్స్.. ట్రంప్ టెన్షన్
అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్.. ఇండియా సహా వివిధ దేశాల విద్యార్థులను టెన్షన్ పెడుతున్నారు. ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే.. ఇమ్మిగ్రేషన్ కు సంబంధించి కఠిన నిర్ణయాలుంటాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దానికి తగినట్లుగానే ట్రంప్ టీమ్.. వివేక్ రామస్వామి, మస్క్ బృందం పనితీరు కనిపిస్తోంది. దీంతో ముందస్తుగానే వర్సిటీలు, కంపెనీలు.. తమ ఉద్యోగులు, విద్యార్థులకు మెయిల్స్ పంపిస్తున్నాయి.
అమెరికన్ వర్సిటీల(us varsity mails) సూచనలతో ఇండియా సహా విదేశీ విద్యార్దుల్లో ఆందోళన నెలకొంది. ప్రియమైన విద్యార్థినీ విద్యార్ధుల్లారా, విదేశి ఉద్యోగుల్లారా.. ఎక్కడున్నా సరే త్వరగా అమెరికాకు వచ్చేయండి. మీ మీ స్థానాలను పదిలం చేసుకోండి అని మెయిల్స్ పంపించాయి పలు వర్సిటీలు. అందుకు కారణం.. జనవరి 20న ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. విదేశీ విధానాలు, ఆర్ధికం, ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన అంశాలపై ఆయన సంతకం చేస్తారనే చర్చ నడుస్తోంది. అది జరిగితే విదేశీ విద్యార్ధులు ఇక అమెరికాలో అడుగు పెట్టడం అంత ఈజీ కాదనేది సదరు వర్సిటీల అభిప్రాయం. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. 2017, 17లో అమెరికాలో పలు కోర్సుల్లో జాయినైన విద్యార్దులు ఇండియాకు వచ్చారు. సెకండ్ ఇయర్ కోసమని అమెరికా వెళ్తే ఇమ్మిగ్రేషన్ అధికారులు వాళ్లను వెనక్కి పంపారు. చదువు పేరిట వచ్చి పార్టీ టైమ్ కొలువు చేస్తున్నారంటూ..బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసి మరి స్టూడెంట్స్‌ను భారత్‌కు తిప్పి పంపారు.
ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై భిన్నాభిప్రాయాలు
ట్రంప్ పవర్ పగ్గాలు చేపట్టాక ఇమ్మిగ్రేషన్ పాలసీలో భారీగా మార్పులుంటాయని కొందరు..అలాంటిదేమి వుండదని మరికొందరు ఇలా మిశ్రమ స్పందన(mixed reaction) వినిపిస్తోంది. విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు. దాంతో స్టూడెంట్స్‌లో భరోసా ఉండేది. కానీ ఆయన పదవి చేపట్టేలోపు వెనక్కి రావాలని వర్సీటీలు మెయిల్స్‌తో మళ్లీ అలజడి మొదలైంది. ట్రంప్ పాత ఫ్లేవర్నే కంటిన్యూ చేస్తారా.. ఫేవరబుల్‌గా వ్యవహరిస్తారా? అనే డైలమా మొదలైంది. వర్సిటీల నుంచి మెయిల్స్ అందుకున్న విద్యార్ధులు ఉన్నఫళంగా అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దాంతో అమెరికా టికెట్లు హాట్ కేకుల్లా మారాయి. ఇదే అదనుగా విమాన సంస్థలు టికెట్ల రేట్లను ఆమాంతం పెంచేశాయి. సాధారణంగా 60 వేలు నుంచి 70వేలు ఉంటే ఫెయిర్ కాస్తా ఇప్పుడు లక్ష 70వేలకు పైగా పెంచేసినట్టు తెలుస్తోంది.






