అమిత్ షా శాసించారు..నేతలు పాటించారు..

తెలంగాణలో పార్టీ విభేదాలను ఒక్క ఆర్డర్ తో కేంద్రహోంమంత్రి అమిత్ షా అదుపు చేశారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా తమిళిసైతో మాట్లాడిన అమిత్ షా.. ఆమెకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో ఉన్న విబేధాలను తొలగించుకోవాలని సూచించారు. దీంతో తమిళి సైతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమావేశమయ్యారు. శుక్రవారం చెన్నైలోని తమిళిసై నివాసానికి వెళ్లిన అన్నామలై.. ఆమెతో భేటీ అయ్యారు. తమిళిసైతో భేటీ కావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. పార్టీలోని సీనియర్ నేతల్లో ఆమె ఒకరని పేర్కొన్నారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా కూడా తమిళిసై పని చేశారని వివరించారు. ఆమె రాజకీయ అనుభవంతోపాటు సలహాలు పార్టీ బలోపేతానికి దోహదపడతాయని అన్నామలై ఆకాంక్షించారు. తాజాగా వీరిద్దరి భేటీతో ఇన్నాళ్లుగా నలుగుతున్న ఈ వివాదం కాస్తా సద్దుమణిగినట్లు అయింది.
ఇటీవలి కాలంలో అన్నామలై తీరుపై తమిళిసై అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తనతో పాటు అన్నామలై కూడా ఓడిపోవడంతో ఆమె .. తీవ్రమైన కామెంట్స్ చేశారు. పార్టీ ఓటమికి అన్నామలై కారణమని ఆరోపించారు.ఈ వ్యాఖ్యలు..బీజేపీలో కలకలం రేపాయి. దీంతో అమిత్ షా రంగంలోకి దిగారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్బంగా దొరికిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. అన్నామలైతో విబేధాలను ప్రస్తావించారు. ఆమె ఏదో చెప్పబోతుండగా… విభేద పరిష్కారాలపై ఫోకస్ పెట్టాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఇంకేముంది షా ఆదేశాల ప్రకారం ఇద్దరు నేతలు సమైక్యరాగాన్ని ఆలపించారు.
సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో ఇండియా కూటమి సూపర్ హిట్టైంది. ఎన్డీఏ కూటమిని మట్టికరిపించింది. మరీ ముఖ్యంగా డీఎంకే చీఫ్ స్టాలిన్ ఎత్తుగడలకు ఎన్డీఏ కూటమి చిత్తైంది. ఓవైపు స్టాల్ వార్డ్ లా స్టాలిన్ నిలిస్తే.. అతనికి ధీటైన వ్యక్తి ప్రచారంలో లేకపోయారు. ఇక ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, కేంద్రమంత్రులు ప్రచారాన్ని సాగించినా..జనం మాత్రం స్టాలిన్ వైపే మొగ్గుచూపారు. మరీ ముఖ్యంగా స్టాలిన్ రాజకీయ కక్షలను ప్రదర్శించకపోవడం, జయలలిత పథకాలను పేరు సైతం మార్చకుండా కొనసాగిస్తుండడంతో.. అన్నా డీఎంకే అభిమానుల్లో సైతం సానుకూల స్పందన వ్యక్తమైంది.
మరోవైపు పార్టీలో అధికారం కోసం కొన్నాళ్లుగా అన్నాడీఎంకేలో సాగిన పోరు ఇంకా ప్రజల్లో గుర్తుందని చెప్పొచ్చు. దీనికి తోడు డీఎంకే రగిల్చిన ద్రవిడ నినాదం మరోసారి వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. యాంటీ హిందీ, నాన్ లోకల్ అంశాలు కూడా తమిళనాడులో ఇండిాయా కూటమి విజయంలో కీలకభూమిక పోషించాయని నిపుణులు భావిస్తున్నారు.