AIADMK: ఆ జిల్లాలే గేమ్ చేంజర్..? పళని స్వామి డేరింగ్ స్టెప్..!
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ రాజకీయం ఆసక్తిని రేపుతోంది. డిఎంకె(DMK), అన్నాడిఎంకే తమిళనాడులో రాజకీయ వ్యూహాలతో వాతావరణం వేడెక్కిస్తున్నాయి. జయలలిత మరణం తర్వాత బలహీనపడింది అనుకున్న అన్నాడిఎంకేని పోటీలో నిలబెట్టే విషయంలో మాజీ సిఎం పళని స్వామి(Palani Swami) సక్సెస్ అయ్యారు. అన్ని పార్టీలను ఇండియా కూటమికి వ్యతిరేకంగా పని చేసే దిశగా ఒప్పించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా రెండు పార్టీలను ఎన్డియేకి కూటమిలోకి తీసుకొచ్చారు.
పలు పార్టీలు వరుసగా.. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డియే కూటమిలో చేరుతున్నాయి. ఇప్పటికే, ఎన్డీఏ కూటమిలో పీఎంకే, ఏఎంఎంకే, తమిళ మానయ కాంగ్రెస్, పురచ్చి భారతం, జాన్ పాండియన్, ఫార్వర్డ్ బ్లాక్, పుతియా నీతి పార్టీ, ఐజేకే వంటి పార్టీలు తమిళనాడు ఎన్డియే కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీలతో పాటు తాజాగా పుతియా తమిళనాడు, డీఏండీకే పార్టీలతో అన్నాడిఎంకే నాయకత్వం చర్చలు జరుపుతోంది. సినీ నటుడు విజయ్(TVK) పొలిటికల్ ఎంట్రీతో పొలిటికల్ గేమ్ హాట్ హాట్ గా ఉండటంతో ఈ గెలుపు ఓటముల మధ్య పెద్ద తేడాగా ఉండదు అని అంచనా వేస్తున్నారు.
ఈ తరుణంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కొంగు ప్రోగ్రెస్ పార్టీ, కొంగునాడు ప్రోగ్రెస్ పార్టీలు అన్నాడిఎంకె నేతృత్వంలోని కూటమిలో చేరడం సంచలనం అయింది. గత ఎన్నికల్లో ఈ ప్రాంతం అన్నాడిఎంకేకి అండగా నిలబడ్డాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు పళని స్వామి నేతృత్వంలో కూటమిలో చేరాయి. అటు డెల్టా జిల్లాలపై కూడా అన్నాడిఎంకే ఫోకస్ పెట్టింది. తమిళ దేశం పార్టీ అక్కడ కీలకంగా ఉండటం, మంత్రు కేఎన్ నెహ్రూ ఆ పార్టీని ఇండియా కూటమిలోకి తీసుకురావడంతో రాజకీయం కాస్త వేడెక్కింది.













