అమెరికాతో చర్చల్లేవ్
అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మధ్య విభేదాలు ప్రచ్చన్న యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ నెలలో అమెరికాతో జరగబోయే వ్యూహాత్మక చర్చలను రద్దు చేస్తున్నట్లు రష్యా తాజాగా ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య మరోసారి విభేదాలు చోటుచేసుకున్నాయి. అయితే అమెరికా తీరు వల్లే తాము చర్చలను రద్దు చేశామని రష్యా చెప్పడం గమనార్హం. మార్చి 6, 7 తేదీల్లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అమెరికా, రష్యా మధ్య సమావేశానికి షెడ్యూల్ ఖరారైంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించేందుకు నిర్ణయించారు. అయితే ఈ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికాలోని రష్యా రాయబారి అనాటోలీ అంటోనోవ్ తెలిపారు.













