ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తైనట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగిస్తారన్నారు. రాష్ట్రంలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ ఐదేళ్లలో జరిగిందని తెలిపారు. 5 రోజులుగా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఐదేళ్లలో జరిగాయన్నారు. నిరంతర విద్యుత్ ఇస్తున్నామని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావొస్తున్నాయని పేర్కొన్నారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టమన్నారు.













