రానా సరసన సాయి పల్లవి
నీదీ నాదీ ఒకే కథ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు వేణు ఉడుగుల. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, జీవిత లక్ష్యం, యువత ఆలోచనలు.. వీటి చుట్టూ నీదీ నాదీ ఒకే కథ రూపొందింది. ఇప్పుడు మరో వైవిధ్యభరితమైన కథతో తన రెండో ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఆ చిత్రంలో రానా, సాయిపల్లవి జంటగా నటించనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తారు. ఈసారి కూడా వేణు ఓ సామాజిక అంశాన్ని కొత్త కోణంలో చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి పడి పడి లేచె మనసు లో నటిస్తోంది. రానా చేతిలోనూ రెండు చిత్రాలున్నాయి. అవి పూర్తయ్యాకే ఈ కొత్త సినిమా పట్టాలెక్కుతుంది.













