సెప్టెంబర్ 10న తెలుగు కవుల సమ్మేళనం
దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు కవుల సమ్మేళనానికి కరీంనగర్ వేదిక కానుంది. దీన్ని తెలంగాణ రైతు హార్వెస్టర్ సంఘం ఆధ్వర్యంలో వెయ్యి కలాల వేడుక.. వెయ్యి హలాల వేదిక పేరుతో సెప్టెంబర్ 10న నిర్వహించనున్నారు. కరీంనగర్లో కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. తెలంగాణ రైతు హార్వెస్టర్ సంఘం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా కవులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారని అన్నారు. పశ్చిమ్‌బంగ, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 786 మంది కవులు పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పారు. ఇది ప్రపంచ రికార్డుగా నమోదు కాబోతుందని తెలిపారు.













