డల్లాస్‌లో మిర్చి సాగు ధరలపై సెమినార్
డల్లాస్ నగరంలో ఉన్న తబలా ఇండియన్ రెస్టారెంట్ లో మిర్చి సాగు ధరలు అనే అంశం పై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మిర్చి యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు గుంటూరు మిర్చియార్డ్ తెలుగువారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందని అన్నారు.
రైతులు పండించే పంటలలో సమతుల్యం పాటిస్తే ధరలను రైతులే నిర్ణయించగల సామర్ద్యము వస్తుందన్నారు. ధరల పతనానికి ముఖ్యకారణం అధిక విస్తీర్ణంలో సాగు చేయడం, అధిక దిగుబడి, విదేశీ ఎగుమతులు తగ్గడం అని అన్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం మిరపసాగు విస్తీర్ణం బాగా పెరిగిందని యార్డ్‌కి వచ్చే టిక్కీలు రోజుకు లక్ష నుంచి నాలుగు లక్షలకు పెరిగాయని అన్నారు. ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్తూ రైతుకి ఒకక్వింటాకి 1500 రూపాయలు అదనంగా యార్డ్ నుంచి నిధులు ఇస్తున్నామన్నారు యార్డ్‌లో రైతులకు ఉచిత భోజనం, విశ్రాంతి తీసుకొనే సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. రైతు శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, గిట్టుబాటు ధరల విషయంలో కూడా రోజూ అందరితో సమావేశాలు నిర్వహించి సమీక్షిస్తున్నారన్నారు. ప్రవాసాంధ్రులు రైతులకి ఉపయోగపడే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేసి మాతృదేశానికి సేవ చేయాలని మన్నవ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారైలు శ్రీనివాస్ కొమ్మినేని, వేణు పావులూరి, కిరణ్ తుమ్మల, నవీన్ యర్రమనేని, శ్రీనివాస్, వాసు నందిపాటి, వెంకట్ యలమర్తి, పూర్ణ యలవర్తి, విజయ్ భార్గవ్, నందిపాటి, జగదీష్ మోరంపూడి, హేమంత్ కోగంటి సిద్దార్త యలవర్తి, నాగార్జున యలవర్తి, క్రాంతికృష్ణ కొండబోలు, హర్ష గొట్టిపాటి, విజయ్, చిరంజీవి, నాగరాజ్, సతీష్ రాజేష్, చిన్న ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.













