ఢిల్లీ నుంచి ఏపీకి రావాలి
ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమిస్తున్న ఎంపీలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. అనంతరం ఆయన వారితో మాట్లాడుతూ ఢిల్లీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ రావాలని ఆదేశించారు. ఏపీకి అన్యాయం జరిగిందనే విషయం టీడీపీ ఎంపీల నిరసనలతో జాతీయస్థాయిలో అందరూ గుర్తించారని తెలిపారు. ప్రధాని మోదీ ఇంటిని ముట్టడించడం, రాజ్‌ఘాట్‌లో నిరసన కార్యక్రమం వంటి అంశాలు అందరి దృష్టికి వెళ్లాయని, రేపటి సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకుందామని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. కాగా రేపు ఉదయానికి నియోజకవర్గాలకు టీడీపీ ఎంపీలు చేరుకోనున్నారు.













