ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు కాదు… ఆవేశంలో మాట్లాడా
రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు. మనిషి ఒకచోట ఆయన మనసు మరోచోట ఉందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి రాజ్యసభలో వివరణ ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్‌పై వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా. వెంకయ్యనాయుడిపై నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా. మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటా. ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు కాదు, ఆవేశంలో మాట్లాడా. రాజ్యసభ చైర్మన్‌ను అగౌరవ పరచాలనుకోలేదని అని ప్రకటించారు.













