ఢిల్లీలో ప్రపంచ సాహితీ ఉత్సవం
ఢిల్లీలో 2024 మార్చి 11 నుంచి 16 వరకు ప్రపంచ సాహితీ ఉత్సవం నిర్వహించనున్నట్లు కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ మాధవ్ కౌశిక్, కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావులు తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో వారిద్దరూ మాట్లాడారు. ఢిల్లీలో ఆరు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా రచయితలు, కవులు, కళాకారులు హాజరవుతారని పేర్కొన్నారు. రచయిత్రి అబ్బూరి రాజేశ్వరి శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వెలుగు లోని రాని అనేకమంది రచయితలు, కవులు, కళాకారులను జనబాహుళ్యంలోకి తీసుకొచ్చేందుకు అకాడమీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని వెల్లడించారు. తొలుత మోపిదేవి సుబ్రహ్మణేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.













