ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో చెప్పడం కష్టం
ప్రపంచ మొత్తం సంక్షభ స్థితిలో చిక్కుకుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ వర్చువల్ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రదాని మోదీ ప్రసంగించారు. ఈ అనిశ్చిత పరిస్థితి ఇంకా ఎంతకాలం ఉంటుందో చెప్పడం చాలా కష్టమని అన్నారు. ఈ నేపథ్యంలో మన తయారు చేయని వ్యవస్థలు, పరిస్థితులపై ఆధారపడం సరైంది కాదని గ్లోబల్ సౌత్‌కు సూచించారు. 21వ శతాబ్దంలో ప్రపంచ అభివృద్ధికి దక్షిణాది దేశాలే చోదక శక్తులని తేల్చి చెప్పారు. ఆహారం, ఇంధనం, ఎరువలు ధరల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ 19 ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులపై ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం మనందరికి కొంగొత్తు ఆశలు నూతన శక్తిని తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.













