బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు … రాజ్ భవన్ లో నాకు

పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్‌లో ప్రస్తుతమున్న కోల్‌కతా పోలీసులతో తన భద్రతకు ముప్పు ఉందని గవర్నర్ సి.వి. ఆనంద బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్‌ఛార్జి అధికారి, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంది. అలా అనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే నేను సీఎం మమతాబెనర్జీకి సమాచారం ఇచ్చాను. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు అని బోస్ ఆందోళన వ్యక్తం చేశారు. తన అధికారిక నివాసంలో ఉన్న పోలీసు సిబ్బంది తనపై నిఘా ఉంచారంటూ ఇప్పటికే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బయటి వ్యక్తుల ప్రభావం వల్ల వారు అలా చేస్తున్నారని గవర్నర్ భావిస్తున్నారు.