ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు… ఒంటరిగా ఉన్నా సరే
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో కొత్త ఆంక్షలు విధించింది. కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లినా ఆ వ్యక్తి కచ్చితంగా మాస్క్‌ను ధరించాలని తాజా ఆదేశాల్లో పేర్కొన్నది. మాస్క్ అనేది సురక్షా కవచంగా పనిచేస్తుందని, అది కోవిడ్ వ్యాప్తిని అడ్డుకుంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఒంటరిగా ప్రైవేటు కారుల్లో వెళ్తున్న వారిపై జరిమానా విధించడాన్ని రద్దు చేయాలని దాఖలైన నాలుగు పిటిషన్లను కోర్టు కొట్టిపారేసింది. కారులో ఒక్క ప్రయాణికుడు ఉన్నా అది పబ్లిక్ స్పేప్ అవుతుందని కోర్టు తన తీర్పులో చెప్పింది.
కారులో ఒంటిరిగా ప్రయాణిస్తోన్న వ్యక్తి మాస్కు ధరించాలనే నిబంధన ఏదీ లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. అయితే కొవిడ్ కట్టడికి రాష్ట్రాలు సొంతంగా నియమాలు రూపొందించి, అమలు చేసుకునే హక్కు ఉందని తేల్చిచెప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రజలు మాస్కులు ధరించడానికే ఢిల్లీ ప్రభుత్వం మొగ్గుచూపింది. గతేడాది ఏప్రిల్‌లో ఆ తరహా నిబంధనలను కూడా రూపొందించింది.













