శశికళ కీలక వ్యాఖ్యలు… రీ ఎంట్రీకి టైమెచ్చింది

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ప్రాణ స్నేహితురాలు వీకే శశికళ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పార్టీలోకి తన రీఎంట్రీకి సమయం ఆసన్నమైందన్నారు. తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇక అన్నాడీఎంకే పనైపోయిందని భావించొద్దని అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అమ్మ పాలన ను తిరిగి తీసుకొస్తామంటూ తెలిపారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారని ఆరోపించారు. ఇకపై తానే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తానని తెలిపారు. పార్టీపై పట్టు కోసం గతంలో ఆమె విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. తిరిగి ప్రవేశించేందుకు సమయం ఆసన్నమైందని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో తాజాగా ఆమె వ్యాఖ్యానించారు. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ఎవరూ నిరాళ చెందాల్సిన అవసరం లేదన్నారు. తమిళ ప్రజలు మనతో ఉన్నారు. నేను చాలా నమ్మకంతో ఉన్నాను. నా ప్రవేశం ప్రారంభమైంది. నేను ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన సమయం వచ్చేసింది. అన్నాడీఎంకే పనైపోయిందనుకోవద్దు అని అన్నారు.