విదేశీయులకు గుడ్ న్యూస్ … ఆగస్టు 31 వరకు

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో కేంద్రం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు విదేశీయులు భారత్‍లో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం వారి వీసా గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశంలో చిక్కుకున్న విదేశీయుల వీసా గడువు ఆగస్ట్ 31, 2021 వరకు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక విదేశీ పౌరులు తమ వీసా గడువు పొడిగింపు కోసం సంబంధిత ఎఫ్‍ఆర్‍ఆర్‍ఓ లేదా ఎఫ్‍ఆర్‍ఓకు ఎటువంటి దరఖాస్తును సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. విదేశీ పౌరులు దేశం నుంచి వెళ్లే ముందు సంబంధిత ఎఫ్‍ఆర్‍ఆర్‍ఓ, ఎఫ్‍ఆర్‍ఓకు నిష్క్రమణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఎటువంటి ఓవర్‍స్టే జరిమానా విధించకుండా ఉచిత ప్రతిపాదికన మంజూరు చేయబడుతుందని కేంద్రం తెలిపింది.