ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం
ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఫీు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 1958 మార్చి 23న జన్మించిన వినయ్ కుమార్ సక్సేనా కాన్పూర్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. రాజస్థాన్‌లో జేకే గ్రూప్ సంస్థలో అసిస్టెంట్ ఆఫీసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. గుజరాత్‌లోని ప్రతిపాదిత పోర్ట్ ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించేందుకు గాను 1995లో జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత సీఈవోగా బాధ్యతలు చేపట్టి, ధోలేర పోర్టు ప్రాజెక్టు డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేబినెట్ మంత్రులు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు ఈ వేడుకలకు హాజరయ్యారు. గతంలో ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్‌గా విధులు నిర్వహించిన అనిల్ బైజల్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దానిని ఆమోదించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో మే 23న కొత్త ఎల్జీగా సక్సేనాను కేంద్ర నియమించింది.













