కొత్త ఆవిష్కరణలపై యువత దృష్టి సారించాలి: ఉపరాష్ట్రపతి
ప్రతి ఒక్కరూ వీలైనన్ని భాషలు నేర్చుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఐఐటీ తిరుపతి 6వ ఇన్స్టిట్యూట్ డే లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొత్త ఆవిష్కరణలపై యువత దృష్టి సారించాలి. అన్ని పుస్తకాలు ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కావాలి. శాస్త్ర సాంకేతిక, వైద్య, న్యాయశాస్త్రాల బోధన ప్రాంతీయ భాషల్లోనే జరగాలి. ప్రాథమిక స్థాయి నుంచి బోధన మాతృభాషలోనే జరగాలి. ప్రభుత్వ పరిపాలన స్థానిక ప్రజల వాడుక భాషలో ఉండాలి. కోర్టులో జరిగే వాదప్రతివాదనలు మాతృభాషలోనే జరగాలి. కోర్టులు ఇచ్చిన తీర్పులు ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కావాలి. ఆంగ్ల భాషకు నేను వ్యతిరేకంగా కాదు అని అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఐఐటీ ప్రాంగణంలో మొక్క నాటారు.













