టీటీడీ సలహా మండలి అధ్యక్షురాలిగా… వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఢిల్లీ, ఉత్తర భారత దేవాలయాల స్థానిక సలహా మండలి అధ్యక్షురాలిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డిల సమక్షంలో మండలి సభ్యులతో కలసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలో టీటీడీ ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













