ఢిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ హాజరయ్యారు. అమెరికా బయలుదేరే ముందు ఆయన ఢిల్లీలో వీధుల్లో ఆటోలో చక్కర్లు కొట్టారు. మలాసా టీని టెస్ట్ చేశారు. తనకు స్వాగతం పలికిన చిన్నారులతో కొద్దిసేపు సరదాగా గడిపారు. ముంబయి. కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయాల సిబ్బందిని, వారి కుటుంబాలను కలిశారు. ఈ సందర్భంగా భారత్`అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న సిబ్బందిని ప్రశంసించారు. బ్లింకెన్ జీ20 సమావేశాల అనంతరం క్వాడ్ సభ్యదేశాలైన భారత్, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరితో కలిసి చైనాను కట్టడి చేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలను చర్చించినట్లు సమాచారం. తన పర్యటనలో ఇండో`పసిఫిక్ రీజియన్‌లో సంరక్షిచడంలో అమెరికా, భారత్ నిబద్దతకు అద్దంపడుతోందని బ్లింకెన్ పేర్కొన్నారు. పర్యటనలో భారత్‌లోని మసాలా ఛాయ్‌ను రుచి చూడడం సహా ప్రతిభావంతులైన మహిళలతో సమావేశమయ్యామని పేర్కొన్నారు. సమయం దొరికితే తాను ఎక్కువగా భారత్‌లో కాలం గడపడడానికి ఇష్టపడుతానని పేర్కొన్నారు.













