భారత్ సిద్ధం.. అక్కడి ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి : గోయల్
అమెరికాలో ప్రాథమిక వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దీనిపై ఎప్పుడు సంతకం చేయాలన్నది అమెరికాయే నిర్ణయించుకోవాల్సి ఉందన్నారు. వాణిజ్య ఒప్పందం విషయమై అమెరికాతో భారత్ సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉందన్నారు. తాను, అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లిట్ జర్ ప్రాథమిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చాలా అంశాలను పరిష్కరించుకున్నట్టు గోయల్ చెప్పారు. నేను అమెరికా రాయబారి లిట్జర్ తో మాట్లాడాను. అమెరికా అధ్యక్ష ఎన్నికలోపు లేదా ఎన్నికలు ముగిసిన వెంటనే దీన్ని కదుర్చుకోవడంపై దృష్టి సారించాలని అంగీకారానికి వచ్చాము. మొత్తం ప్యాకేజీ దాదాపుగా సిద్ధమైనట్టే. అమెరికాలో స్థానిక రాజకీయ పరిస్థితులు అనుకూలిస్తే, ఏ సమయంలో అయినా ఇది •రారు కావచ్చు అంటూ మంత్రి గోయల్ వివరించారు.













