అమెరికా రాయబారి ధునుచీ నృత్యం
దిల్లీలోని చిత్తరంజన్ పార్క్లో ఏర్పాటు చేసిన దుర్గమ్మ మండపానికి అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి విచ్చేయగా, నిర్వాహకులు బెంగాలీ సంప్రదాయాల ప్రకారం ఆయన్ను ఆహ్వానించారు. మండపంలో నిర్వహించిన అమ్మవారి పూజలో ఉత్సాహంగా పాల్గొన్న గార్సెట్టి స్థానిక ఆచారం ప్రకారం నిప్పుల కండను నోటితో పట్టుకొని ధునుచీ నృత్యం చేయడం విశేషం. వేదికపై నృత్యం చేస్తున్న చిన్నారులతో కాసేపు ముచ్చటించిన ఆయన వారితో కలిసి ఫొటోలకు పొజులిచ్చారు. ప్రదర్శనలో ఉంచిన రకరకాల బెంగాలీ వంటకాలను రుచి చూశారు. కోల్కతా స్పెషల్ రaాల్ మురీ తో పాటు బిర్యానీ, చేపలు, దసరా మిఠాయిలును ఆస్వాదించారు.













