ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు.. హాస్పిటల్లో ఉన్నప్పుడే
శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆస్పత్రిలో చేరి కదల్లేని స్థితిలో ఉన్న సమయంలోనే తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలకు ప్రణాళికలు జరిగాయన్నారు. శివసేన నుంచి శిందే వర్గం తిరుగుబాటు నేపథ్యంలో తలెత్తిన పరిణామాలతో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత తొలిసారి ఆయన స్పందించారు. తన శరీరం కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ల కదలికలు హెచ్చు స్థాయిలో సాగినట్లు విమర్శించారు. అతని రాక్షసత్వం అలాగే ఉండేదన్నారు. షిండేను నమ్మడం తాను చేసిన పెద్ద తప్పు అని ఉద్ధవ్ అన్నారు. తన తండ్రి పేరిట షిండే వర్గం ఎన్నికల్లో ఓట్లు అడగరాదన్నారు. ఎండిన ఆకులు చెట్టు నుంచి రాలిపడుతాయని, చెట్టు నుంచి అన్ని పొందిన అవి ఇప్పుడు ఆ చెట్టును వీడుతున్నట్లు షిండే వర్గంపై ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా మహారాష్ట్రను వెన్పుపోటు పొడిచిందన్నారు.













