రూల్స్ పాటిస్తాం… కేంద్రానికి ట్విట్టర్

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 పాటించేందుకు ఇదే చివరి అవకాశమని కేంద్ర ఐటీశాఖ నోటీసులు జారీ చేసిన నాలుగు రోజుల తర్వాత ట్విట్టర్ స్పందించింది. కొత్త ఐటీ రూల్స్ పాటించేందుకు సిద్దమని ప్రకటించింది. నిబంధనలు పాటింపునకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వారం రోజుల వ్యవధిలో చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ నియామకానికి సంబంధించిన వివరాలను అందజేస్తామని ట్విట్టర్ వెల్లడించింది. కొత్త నిబంధనల అవశ్యకతను గుర్తించాం. మార్గదర్శకాలు పాటింపునకు ప్రయత్నాలు చేస్తున్నాం. భారత్‍లో అధికారులను కూడా నియమించకుంటామని ట్విట్టర్ వెల్లడించింది.
ట్విటర్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. భారత్‍లో నిబంధనలు పాటించాలని ట్విట్టర్ నిర్ణయించిందన్నారు. మార్గదర్శకాలు పాటిస్తామని భారత ప్రభుత్వానికి హామీ ఇస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టామని వివరించారు. ఇందుకోసం భారత ప్రభుత్వంతో చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. పురోగతికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు.