మోదీపై ట్రాన్స్ జెండర్ హేమాంగి సఖి పోటీ
లోక్సభ ఎన్నికల్లో ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రముఖ ట్రాన్స్జెండర్, శ్రీకృష్ణుడి పరమ భక్తురాలు మహామండలేశ్వర్ హేమాంగి సఖి మా పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 20 లోక్సభ స్థానాలకు పోటీ చేయబోతున్న అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం) వారణాసి నియోజకవర్గంలో మోదీపై ఆమెను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ నియోజకవర్గంలో మోదీపై ఆమెను తమ అభ్యర్థిగాని నిలబెట్టింది.ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్ మరోసారి పోటీ చేస్తున్నారు. తొలి విడత ఎన్నికల్లో భాగంగా వారణాసిలో జూన్ 1న పోలింగ్ జరుగనున్నది.













