ఆ మూడు పుస్తకాలు కావాలి… కోర్టును కోరిన కేజ్రీవాల్
మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌజ్ అవెన్యూకోర్టు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తిహాడ్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆయన కోర్టుకు కొన్ని అభ్యర్థనలు చేశారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది అప్లికేషన్ సమర్పించారు. జైలులో చదివేందుకు తనకు మూడు పుస్తకాలు కావాలని కేజ్రీవాల్ కోరారు. రాయాయణం, భగవద్గీత, జర్నలిస్టు నీరజా ఛౌదరీ రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ వంటి పుస్తకాలు జైల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే ఒక బల్ల, కుర్చీ మెడిసిన్జ్ డేటా ప్రకారం ఆహారం అందించాలని అడిగారు. ఇప్పటికే ధరిస్తోన్న లాకెట్‌ను కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు.













