తమిళనాడులో మరో రాజకీయ పార్టీ… త్వరలోనే జెండా, అజెండా
తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ కథానాయకుడు, దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు విజయ్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోంది. దానిపై వ్యతిరేకంగా పోరాడేందుకు రాజకీయాల్లోకి వచ్చా. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు. ఇతర పార్టీలకు మద్దతు కూడా ఇవ్వం. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతాం అని విజయ్ వెల్లడిరచారు. ఇక, పార్టీ జెండా, అజెండాను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.













