న్యూయార్క్ బయల్దేరిన విమానంలో.. సాంకేతిక సమస్య
ముంబై నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన ఓ విమానం సాంకేతిక సమస్య కారణంగా వెనక్కి తిరిగి వచ్చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 119 విమానం మంగళవారం తెల్లవారుజామున 2:19 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమనాశ్రయానికి బయలు దేరింది. అయితే విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా విమానాన్ని ముందు జాగ్రత్తగా తిరిగి ముంబై మళ్లించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ముంబైలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేసి వారందరినీ తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడిరచారు.













