బీజేపీలో చేరిన మాజీ గవర్నర్ తమిళిసై
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె, భారతీయ జనతా పార్టీ( బీజేపీ)లో చేరారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. గతంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన తమిళిసై మరోసారి ఎన్నికల బరిలో నిలవనున్నట్లు ఈ సంద్భంగా తెలిపారు. ప్రజా సేవ చేసేందుకే తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టినట్లు తెలిపారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడిరచారు. తమిళనాడులో కమలం వికసిస్తుందని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో తన ఉనికిని విస్తరించాలని భావిస్తున్న బీజేపీకి తమిళిసై రాక కొత్త ఉత్సాహాన్నిస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నారు. తమిళిసై రాకను పార్టీ అధ్యక్షుడు అన్నామలై స్వాగతించారు.













