ఆ రికార్డులను భద్రపర్చండి.. పంజాబ్, హర్యానాపై సుప్రీం గుస్సా
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా నెలకొన్న భద్రతా పరమైన లోపాలపై రికార్డులు భద్రపర్చాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టులను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ విషయమై విచారణ చేపట్టింది. ప్రధాని భద్రతలో ఉన్న లోపాన్ని ధర్మాసనం ముందు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ లేవనెత్తారు. విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ రాష్ట్రం, కేంద్రం రెండూ కమిటీలు వేసుకున్నాయని, వారు తమ పని ఆపాలని తాము దీన్ని ఆర్డర్లో నమోదు చేయడం లేదని, అయితే రెండు కమిటీలకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు. ప్రయాణ రికార్డులన్నింటినీ భద్రపర్చాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్టార్ జనరల్‌ను ఆదేశించారు. ప్రధాని భద్రత ఉల్లంఘనపై న్యాయ విచారణ జరిపించాలంటూ లాయర్స్ వాయిస్ అనే సంస్థ వేసిన పిటిషన్‌పై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.













