కేంద్రానికి భారీ ఊరట… జమ్ము కశ్మీర్ లో
జమ్ము కశ్మీర్ నియోజకవర్గాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు కోర్టు ముందు పెండిరగ్లో ఉండగా జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై తీర్పును ప్రకటించలేమని కోర్టు ధర్మాసనం పేర్కొన్నది. జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచడాన్ని సవాల్ చేస్తూ శ్రీనగర్‌కు చెందిన హాజీ అబ్దుల్ ఘనీ ఖాన్, డాక్టర్ మహ్మద్ అయూబ్ మట్టా సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇలా అసెంబ్లీ స్థానాలు పెంచడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82, 170, 330 సెక్షన్లకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఇరు పక్షాలు వాదనలనును జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా తో కూడిన ధర్మాసనం విన్నది. డిసెంబర్ 1న తీర్పును రిజర్వ్ చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు పిటిషన్ రాజ్యాంగ ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నదని, ఆ పిటిషన్‌ను విచారించిన తర్వాత గానీ డీలిమిటేషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. దాంతో డీలిమిటేషన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేస్తూ నిర్ణయం తీసుకున్నది.













