రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తి
ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటం విశేషం. ఈ సంద్భంంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారం. స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభకు నామినేట్ అవడం నారీశక్తికి బలమైన నిదర్శనం. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి చక్కటి ఉదాహరణ. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలి అని మోదీ ఆక్షాకించారు.













