ప్రధాని మోదీతో శ్రీలంక అధ్యక్షుడు భేటీ
శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చలు జరిగాయి. అనంతరం ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు, పరస్పర సహకారం కోసం విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించాయి. గతేడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ స్నేహితుడిలా అండగా ఉంది. శ్రీలంకలో యూపీఐ పేమెంట్ సిస్టమ్‌ను భారత్ ప్రారంభించేందుకు కుదిరిన ఒప్పందం వల్ల ఇరు దేశాల మధ్య ఫిన్‌టెక్ అనుసంధానిత ఉంటుంది. ఇరుదేశాల మధ్య భద్రతా ప్రయోజనాలు, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కలిసి పనిచేయడం అవసరం. అందుకే ఆర్థిక భాగస్వామ్యానికి పెంపొందించుకునేందుకు విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించినట్లు మోదీ తెలిపారు. ఈ విజన్‌లో ముఖ్యంగా పర్యాటకం, విద్యుత్తు, వాణిజ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, అనుసంధానిత వంటి రంగాలలో పరస్పర సహకారాన్ని వేగవంతం చేయడమే ఈ విజన్‌లోని అంశాలు. సాంకేతిక పరమైన విషయాలు, పెట్రోలియం పైప్‌లైన్ గురించి త్వరలో చర్చలు జరుగుతాయి. మత్య్సకారుల సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. తమిళ ప్రజల కోరికలను శ్రీలంక ప్రభుత్వం నెరవేరుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.













