ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే.. అది రాజకీయమే
విద్య, వైద్యం పై చేసే ఖర్చు ఎంతమాత్రం ఉచితాలు కావని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. స్టాలిన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యంపై చేసే ఖర్చు ఏ మాత్రం ఉచితాలు కావు. చదువు అనేది జ్ఞానానికి సంబంధించినది. వైద్యం అనేది ఆరోగ్య సంరక్షణకు సంబంధించింది. అందుకే ఈ రెండు రంగాల్లోనూ తగినన్ని సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటోంది. ఇవి ఏమాత్రం ఉచితాలు కావు,. సంక్షేమ పథకాలు ఈ మధ్య ఉచితాలు ఉండకూడదన్న సలహా ఇస్తూ కొంతమందిన వ్యక్తులు కొత్తగా పుట్టుకొచ్చారు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే అది రాజకీయమే అవుతుంది. కాబట్టి నేను మాట్లాడడు అని అన్నారు.
ఉచిత పథకాలు దేశానికి ఏమాత్రం మంచిది కాదంటూ ప్రదాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.













