ఆకాశంలో అద్భుతం
ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం ప్రజలకు కనువిందు చేసింది. సూర్యుడికీ, భూమికీ నడుమ చంద్రుడు అడ్డు రావడంతో గగన తలంలో వలయాకార సుందర దృశ్యం ఆదివారం ఆవిష•త్రమైంది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది. తొలుత భారత్లో గుజరాత్లో ఉన్న ద్వారకలో గ్రహణం కనిపించింది. ముంబైలో ఆకుపచ్చ వర్ణంలో సూర్యుడు సాక్షాత్కరించాడు. రాజస్తాన్లోని జైపూర్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9:16 గంటలకు సూర్యగ్రహణం మొదలైంది. ఇది మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు మరింత సృష్టం కన్పించింది. భారత్లో మాత్రం ఉదయం 9:56 గంటలకు ఆరంభమై మధ్యాహ్నం 3 గంటలా 4 నిమిషాలకు ముగిసింది. సూర్యగ్రహణం వీడడంతో కొన్ని ఆలయాలు ఈ రోజు తెరుచుకున్నాయి.













