ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం….బీజేపీలో చేరిన హేమంత్ సోరెన్ వదిన
లోక్సభ ఎన్నికల వేళ ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబూ సోరెన్ పెద్ద కోడలు, మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి లక్ష్మీకాంత్ బాజ్పాయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. అంతకు కొన్ని గంటల ముందు ఆమె జేఎంఎంకు రాజీనామా చేశారు. పార్టీలో తనను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఏకాకిని చేశారని ఆరోపించారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన హేమంత్ స్థానంలో ఆయన సతీమని కల్పనాకు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయంటూ ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.













