రమణ సింగ్ రికార్డును బ్రేక్ చేసిన.. శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రికార్డు క్రియేట్ చేశారు. అత్యధిక సంవత్సరాల పాటు బీజేపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారు. గతంలో చత్తీస్ఘడ్ సీఎం రమణ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును శివరాజ్ బ్రేక్ చేశారు. రమణ సింగ్ 15 ఏళ్ల 10 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అయితే గురువారం రోజు ఆ రికార్డును శివరాజ్ దాటేశారు. మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ 15 ఏళ్ల 11 రోజుల్ని పూర్తి చేసుకున్నారు. 2005 నవంబర్లో తొలిసారి మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ బాధ్యతలు చేపట్టారు. 2018 వరకు ఆయన పదవిలో కొనసాగారు. 2018 నుంచి 2020 వరకు కమల్నాథ్ సీఎంగా ఉన్నారు. అయితే 2020 మార్చిలో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.













