శరద్ పవర్ సంచలన వ్యాఖ్యలు.. ఆరు నెలల్లో
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కొత్త ఏర్పాటైన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని తెలిపారు. షిండే వర్గంలోని కొందరు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, మంత్రిత్వ శాఖల కేటాయింపుల తర్వాత ఈ లుకలుకలు బయటపడతాయని ఆయన పేర్కొన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో జరిగిన సమావేశంలో పవార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆ పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. ఈ వైఫల్యంతో అసమ్మతి ఎమ్మెల్యేలు తమ అసలు పార్టీ (ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఉద్దేశించి) వైపు వస్తారు. మన చేతిలో కనీసం ఆరు నెలల సమయం ఉందనుకుందాం. అందుకే ఎన్సీపీ నేతలంతా వారివారి నియోజకవర్గాల్లో ప్రజలకు దగ్గరగా ఉండండి, మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు పవార్ సూచించినట్లు వెల్లడిరచారు.













